KCR: చికిత్స కోసం యశోదకు.. ప్రచారం కోసం గాంధీకి: షర్మిల ఎద్దేవా

YS Sharmila Slams KCR
  • సీఎం కేసీఆర్‌పై మరోమారు ఘాటు వ్యాఖ్యలు
  • ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని హెచ్చరిక
  • మహిళా రుణాలను వడ్డీ సహా మాఫీ చేయాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోమారు విరుచుకుపడ్డారు. కరోనా చికిత్స కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ప్రచారం కోసం మాత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.

మహిళలతో నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో షర్మిల మాట్లాడుతూ.. కరోనా చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం రాష్ట్రంలోని మహిళలు 10 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని షర్మిల అన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 60 శాతం అధికమన్నారు. ప్రభుత్వం స్పందించి గత మూడేళ్ల వడ్డీలతోపాటు రుణాలను కూడా మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
KCR
Telangana
YS Sharmila

More Telugu News