Doctor Sudhakar: ప్రభుత్వ ఎస్సీ వ్యతిరేక చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారు: చంద్రబాబు

Chandrababu Naidu Responds On Doctor Sudhakar Death
  • ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు సుధాకర్ బలి
  • నడిరోడ్డుపై దుస్తులు తీసి వేధించింది
  • ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలి
నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్‌ది ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. జగన్ అనుసరిస్తున్న ఎస్సీ వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు సుధాకర్ బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాస్కులు లేవని ప్రశ్నించిన పాపానికి ఆయనను శారీరకంగా, మానసికంగా జగన్ ప్రభుత్వం వేధించిందని, నడిరోడ్డుపై దుస్తులు తీసి మరీ వేధించిందన్నారు. ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Doctor Sudhakar
Chandrababu
Narsipatnam
YS Jagan

More Telugu News