KCR: సెంట్రల్ జైల్లో ఖైదీలతో మాట్లాడి భరోసా నింపిన కేసీఆర్

  • ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన కేసీఆర్
  • ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన సీఎం
  • కలెక్టరేట్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
KCR visits Warangal central jail

ఈరోజు వరంగల్ లో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి కరోనా రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్లి... అక్కడి ఖైదీలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారిలో భరోసా నింపారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను వీక్షించారు.

వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా చికిత్సకు అవసరమైన అన్నీ సమకూర్చుకోవాలని సూచించారు. మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని చెప్పారు.

More Telugu News