JIO: తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న జియో డేటా స్పీడ్... కారణం ఇదే!

JIO data speed raises in AP and Telangana
  • ప్రస్తుతం జియోకు తెలుగు రాష్ట్రాల్లో 40 ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రమ్
  • అదనంగా మరో 20 ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ జోడింపు
  • 50 శాతం పెరగనున్న డేటా స్పీడ్
  • మరింత త్వరితంగా 4జీ సేవలు

దేశంలో చవకైన, వేగవంతమైన ఇంటర్నెట్ డేటా విప్లవానికి కారణమైన రిలయన్స్ జియో తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 4జీ డేటా స్పీడ్ మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం 40 ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉండగా, అందుకు అదనంగా మరో 20 ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ ను జోడించింది. దాంతో డేటా ప్రసార వేగం 60 ఎంహెచ్ జెడ్ వరకు పెరిగినట్టయింది.

ఈ 20 ఎంహెచ్ జెడ్ అదనపు స్పెక్ట్రమ్ ను జియో సంస్థ ఏపీ, తెలంగాణలోని తమ అన్ని టవర్ లకు వర్తింపచేసింది. తద్వారా జియో నెట్వర్క్ డేటా స్పీడ్ 50 శాతం పెరిగినట్టయింది.

తెలుగు రాష్ట్రాల్లో జియో సంస్థకు 3.16 కోట్లకు పైన మొబైల్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. తాజాగా డేటా స్పీడ్ పెంచిన నేపథ్యంలో కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు వీలవుతుందని, ప్రస్తుత వినియోగదారుల్లో మరింత నమ్మకం కలిగించేందుకు దోహదపడుతుందని జియో భావిస్తోంది.

  • Loading...

More Telugu News