Rajinikanth: వీళ్లు ఒరిజినల్ గాంగ్ స్టర్స్: మంచు విష్ణు

Manchu Vishnu describes Mohan Babu and Rajinikanth as Original Gangsters
  • ఆకట్టుకునేలా మోహన్ బాబు, రజనీకాంత్ ఫొటోలు
  • సోషల్ మీడియాలో పంచుకున్న మంచు విష్ణు, లక్ష్మి
  • స్నేహానికి సిసలైన అర్థం అని పేర్కొన్న మంచు లక్ష్మి
  • స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తులని వెల్లడి
సీనియర్ నటులు రజనీకాంత్, మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా చెక్కుచెదరని మైత్రితో వీళ్లు తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారు. ఆ ఫొటోల్లో రజనీకాంత్, మోహన్ బాబు వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో తేజోమయంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోల్లో దిగ్గజాలతో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా కనిపించారు.

దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ... 'వీళ్లు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్' అంటూ చమత్కరించారు. అటు, మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి దీనిపై మరింత వివరణాత్మకంగా స్పందించారు. స్నేహానికి సిసలైన అర్థం అంటే రజనీకాంత్, మోహన్ బాబేనని పేర్కొన్నారు. తమ వరకు కొన్నిసార్లు స్నేహబంధాలు కొనసాగకపోవడాన్ని చూశామని, కానీ వీళ్లిద్దరూ ఏళ్లతరబడి చెలిమి చేయడం అద్భుతమైన విషయం అని పేర్కొన్నారు. వన్ బై టీలు తాగడం నుంచి కారు షెడ్లలో తలదాచుకోవడం వరకు వీరి మైత్రి ఎన్నదగినదని వివరించారు.

ఎంతో సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారిద్దరూ ఇవాళ సూపర్ స్టార్లు అని, అయినప్పటికీ ఒకరికోసం మరొకరు సమయం కేటాయిస్తూ స్నేహానికి విలువ ఇవ్వడం గొప్పవిషయం అని వివరించారు. అయితే వారిద్దరినీ అంతలా అనుసంధానించిన స్వచ్ఛమైన అంశాన్ని కనుగొంటానని భావిస్తున్నట్టు మంచు లక్ష్మి తెలిపారు.
Rajinikanth
Mohan Babu
Original Gangsters
Manchu Vishnu
Manchu Lakshmi
Tollywood
Kollywood

More Telugu News