Oxford University: ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారత విద్యార్థిని ఘన విజయం

  • భారత సంతతి విద్యార్థి అన్వీ భుటానీ జయభేరి
  • అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన 11 మంది
  • భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి
Indian student Rashmi Samanth wins as Oxford University union leader

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థి సంఘానికి జరిగిన ఉప ఎన్నికలో భారత సంతతి విద్యార్థిని అన్వీ భుటానీ ఘన విజయం సాధించారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు జరిగాయి. గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో భారత విద్యార్థిని రష్మీ సమంత్ గెలుపొందారు. అయితే, సోషల్ మీడియాలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో, విద్యార్థి సంఘం నాయకురాలిగా ఆమె తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలు జరిగాయి.

తాజా ఎన్నికల్లో 11 మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఈ స్థాయిలో పోటీ పడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయినప్పటికీ అన్వీ భుటానీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అన్వీ ప్రస్తుతం యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న మ్యాగ్ డాలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్సెస్ లో పీజీ చదువుతున్నారు. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

More Telugu News