AP High Court: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు.. ఎన్నిక‌లు ర‌ద్దు

High court vedict on ap zptc mptc elections
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దుచేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న హైకోర్టు
  • సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదన్న న్యాయస్థానం 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని ఏపీ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌న్న ఆదేశాలను పాటించ‌లేద‌ని వివ‌రించింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో నిబంధ‌న‌లు అమ‌లు కాలేద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

కాగా, ఏపీలో పరిషత్‌ ఎన్నికల రీ షెడ్యూల్ ఏప్రిల్ 2న‌ విడుదలైన విష‌యం తెలిసిందే. అదే రోజున నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 8న పోలింగ్‌ నిర్వహించి, 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అయితే, ఎన్నిక‌లు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ, కోర్టు ఆదేశాల మేర‌కు ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌లేదు. నీలం సాహ్ని నూతన ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంట‌ల‌కే ఈ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.  
AP High Court
Andhra Pradesh
ZPTC
MPTC

More Telugu News