Vijayakanth: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సినీ నటుడు విజయకాంత్

Captain Vijayakanth discharged from hospital
  • బుధవారం అస్వస్థతకు గురైన విజయకాంత్
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ వైనం
  • ఐసీయూ వార్డులో చికిత్స అందించిన వైద్యులు
ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం వేకువజామున ఆయన తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆరోజు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి  తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దీంతో, ఆయనను ఐసీయూ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందించారు.

నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈరోజు ఆయన ఆసుపత్రి నుంచి విడుదల కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కరోనా టెస్టులో కూడా ఆయనకు నెగెటివ్ వచ్చింది.
Vijayakanth
Illness
Discharge
Kollywood

More Telugu News