TDP: టీడీపీ మాక్ అసెంబ్లీ: స్పీకర్ గా కొండపి ఎమ్మెల్యే... మంత్రులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

  • నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన టీడీపీ
  • బదులుగా మాక్ అసెంబ్లీ నిర్వహణ
  • వ్యాక్సిన్లు, ఇతర అంశాలపై చర్చ
TDP conducts mac assembly

ఏపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీడీపీ మాక్ అసెంబ్లీ నిర్వహించింది. నేడు జరిగిన ఏపీ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ... జూమ్ ద్వారా మాక్ అసెంబ్లీ చేపట్టింది. ఈ మాక్ అసెంబ్లీలో స్పీకర్ గా కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి వ్యవహరించారు. మంత్రులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించారు. ఈ మాక్ అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలపై వీడియోలు, క్లిప్పింగ్ లు ప్రదర్శించారు. వ్యాక్సినేషన్ అంశాన్ని కూడా చర్చించారు.

రాష్ట్రాలన్నీ వ్యాక్సిన్ల కోసం పోటీ పడుతుంటే, సీఎం జగన్ మాత్రం విపక్షాలను అణచివేసేందుకు పోటీ పడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల కిష్టప్ప విమర్శించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలతో ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేదని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ అంశంలో ఏపీ జాతీయస్థాయిలో 28వ స్థానంలో ఉందని, ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదన్నారు. ఏపీ సకాలంలో గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేకపోయిందని నిలదీశారు.

More Telugu News