Chiranjeevi: ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభిస్తున్న చిరంజీవి

  • ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న కరోనా పేషెంట్లు
  • తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన చిరంజీవి
  • వారం రోజులలో ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభించే దిశగా కార్యాచరణ
Chiranjeevi to launch Oxygen banks

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతిలో కూడా ఇదే సమస్య కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. జిల్లాల స్థాయుల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా కార్యకలాపాలు మొదలయ్యేలా ఇప్పటికే పనులు మొదలయ్యాయి.

చిరంజీవి ఇప్పటికే ప్రజాసేవలో ఉన్న సంగతి తెలిసిందే. ఎవరూ రక్తం దొరకని సరిస్థితిలో ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో 1998లో ఆయన బ్లడ్ బ్యాంకును స్థాపించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు. అందరికీ వారం రోజుల్లోగా ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

More Telugu News