కరోనా బారిన పడిన పిల్లల వివరాలు సేకరించండి: ప్రధాని మోదీ
- జిల్లా కలెక్టర్లతో మహమ్మారి కట్టడిపై సమావేశం
- జన్యు మార్పుల వల్లే పిల్లలకూ కరోనా అని ఆందోళన
- వ్యాక్సిన్లను వృథా చేయకూడదని అధికారులకు ఆదేశం
కరోనా వ్యాక్సిన్లలో వృథాను అరికట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఉందని, దానిని అధిగమించేందుకు వేస్టేజీని వీలైనంత వరకు తగ్గించాలని ఆయన సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ ను వృథా చేయడమంటే పెద్ద నేరమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. కాబట్టి, పట్టణ, పల్లె ప్రాంతాల్లో అవి వృథా కాకుండా చూడాలన్నారు.