england: ఇంగ్లండ్‌లోనే భార‌త్-న్యూజిలాండ్ మ‌ధ్య డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్.. అధికారిక ప్ర‌క‌ట‌న

  • మ్యాచ్ వేదిక‌పై కొన్ని రోజులుగా సందిగ్ధ‌త
  • క‌రోనా విజృంభ‌ణే అందుకు కార‌ణం
  • టెస్టుకు 4 వేల మందిని అనుమ‌తిస్తామ‌న్న నిర్వాహ‌కులు
  • బ్రిట‌న్‌లో క‌రోనా త‌ర్వాత ప‌రిస్థితులు మెరుగ‌వ్వ‌డంతో  నిర్ణ‌యం  
Around 4000 Fans to be Allowed for India New Zealand match

ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ కు చేరిన టీమిండియా జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌లో త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ వేదిక‌పై కొన్ని రోజులుగా సందిగ్ధ‌త నెల‌కొంది. క‌రోనా విజృంభ‌ణే అందుకు కార‌ణం.
 
ఇంగ్లండ్ లో ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వ‌హించాల‌ని భావించారు. అయితే, ఇంగ్లండ్‌లోనూ కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు క‌రోనా వ్యాప్తి అధికంగా ఉండ‌డంతో ముందుగా నిర్ణ‌యించిన స్టేడియం వేదిక‌గానే మ్యాచు జ‌రుగుతుందా? లేదా? అన్న ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి.

దీనిపై అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న రాకపోవ‌డంతో ప‌లు అనుమానాలు త‌లెత్తాయి. చివ‌ర‌కు ఇంగ్లండ్ వేదిక‌గానే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచు జ‌రుగుతుంద‌ని, ప‌రిమిత సంఖ్య‌లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తామ‌ని ఈ రోజు నిర్వా‌హకులు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క టెస్టుకు 4 వేల మందిని అనుమ‌తిస్తామ‌ని, బ్రిట‌న్‌లో క‌రోనా త‌ర్వాత ప‌రిస్థితులు మెరుగ‌వ్వ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌క‌టించారు.  

More Telugu News