Kalyan Dev: అదే దారి పట్టేసిన 'సూపర్ మచ్చి'

Kalyan Dev movie will be released in OTT
  • పులి వాసు నుంచి 'సూపర్ మచ్చి'
  • మాస్ హీరోగా కల్యాణ్ దేవ్
  • కరోనా కారణంగా విడుదలలో జాప్యం
'విజేత' సినిమా ద్వారా హీరోగా కల్యాణ్ దేవ్ పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడకున్నా, లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత సినిమాగా 'సూపర్ మచ్చి'ని పూర్తి చేసి చాలాకాలమే అయింది. అయితే కరోనా కారణంగా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వారితో చర్చలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.

పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అందువల్లనే ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చారు. గతంలో అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినప్పటికీ వద్దనుకున్నారట. కానీ ఇక థియేటర్లు ఓపెన్ చేసేవరకూ ఎదురుచూడటం వలన మరింత ఆలస్యమవుతుందని భావించి, అమెజాన్ ప్రైమ్ వారితో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. రియా చక్రవర్తి - రచితా రామ్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Kalyan Dev
Riya Chakravarthi
Rachitha Ram

More Telugu News