Doctor: మాస్కు పెట్టుకోనంటూ గొడవ చేసిన డాక్టర్.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

  • మంగళూరులో చోటుచేసుకున్న ఘటన
  • సూపర్ మార్కెట్ కు మాస్క్ లేకుండా వెళ్లిన డాక్టర్
  • ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసు నమోదు
Doctor who refused to wear mask arrested

సెకండ్ వేవ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వంటి అంశాలను ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. దీన్ని ఒక బాధ్యతగా భావించాలని చెపుతున్నాయి.

అయితే, ఈ సామాజిక బాధ్యతను మరిచిన ఓ డాక్టర్ మాస్క్ లేకుండానే ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. మాస్కు ధరించాలని అక్కడి సిబ్బంది ఎంత చెప్పినా పట్టించుకోలేదు. అంతేకాదు, వారితో గొడవకు దిగాడు. దీంతో చేసేదేమీ లేక వారు సదరు డాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సదరు డాక్టర్ పేరు శ్రీనివాస్ కక్కిలియా. మంగళూరులో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సూపర్ మార్కెట్ కు వెళ్లి రచ్చ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా లక్షణాలు లేనప్పుడు మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మాస్క్ తప్పనిసరి అని చెప్పడం ఒక ఫూలిష్ రూల్ అని వ్యాఖ్యానించారు.

More Telugu News