Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Kajal Agarwal says she respects her husbands decision
  • భర్త నిర్ణయాన్ని గౌరవిస్తానంటున్న కాజల్!
  • సోనూసూద్ ప్రధాన పాత్రలో క్రిష్ సినిమా
  • ఇన్ స్టాలో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్  
*  పెళ్లయినప్పటికీ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న కథానాయిక కాజల్ అగర్వాల్ తాను సినిమాలలో కొనసాగడం గురించి తాజాగా మాట్లాడింది. తాను సినిమాలలో కొనసాగాలా? వద్దా? అన్న విషయం తన భర్త గౌతమ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. 'ఇక చాలు.. మానేయ్' అని తను అంటే కనుక, ఆ మరుక్షణమే మానేస్తానని చెప్పింది. తన భర్త నిర్ణయాన్ని గౌరవిస్తానని కాజల్ తెలిపింది.      
*  ఇటీవలి కాలంలో పేదల పాలిట పెన్నిధిలా పేరుతెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ కు సినిమాలలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆయనను తమ సినిమాలో తీసుకుంటే ప్రేక్షకులలో క్రేజ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన కోసం ప్రత్యేక పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు క్రిష్ తాజాగా సోనూ ప్రధాన పాత్రధారిగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వీరి మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట.  
*  యువతరం ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. దాంతో ఆయనకు ఇన్ స్టాలో ఫాలోయింగ్ అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా 12 లక్షల ఫాలోయర్స్ ని సొంతం చేసుకుని   రికార్డు సాధించాడు.
Kajal Agarwal
Sonu Sood
Krish
Vijay Devarakonda

More Telugu News