Andhra Pradesh: రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సర్కారు

AP Govt files counter affidavit against Raghurama bail plea in Supreme Court
  • ఇటీవల రఘురామను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ
  • కౌంటర్ అఫిడవిట్ లో పలు ఆరోపణలు చేసిన సర్కారు
  • రఘురామ హద్దు మీరారని వెల్లడి
  • బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సుప్రీంకు విజ్ఞప్తి

ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ వేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ లో ఆరోపించింది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపింది వాక్ స్వాతంత్ర్యం పేరుతో హద్దు మీరకూడదని, కానీ రఘురామకృష్ణరాజు అతిక్రమించారని వివరించింది.

ప్రజల మధ్యన చీలికలు తెచ్చే ప్రయత్నాలు సరికాదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటనలు, వ్యాఖ్యలు బాగా పరిశీలించాకే కేసు నమోదు చేశామని వివరించింది. రఘురామ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది.

  • Loading...

More Telugu News