Jagan: రేపు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్న సీఎం జగన్

CM Jagan will attend stone laying ceremony of Undavalli road extension
  • ఉండవల్లి కరకట్ట విస్తరణకు రేపు శంకుస్థాపన
  • పాల్గొంటున్న సీఎం జగన్
  • కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద భూమిపూజ
  • రూ.150 కోట్ల వ్యయంతో పనులు
అమరావతిలో రేపు సీఎం జగన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు సీఎం భూమిపూజ చేయనున్నారు. కరకట్ట విస్తరణ పనులకు కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేస్తారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ఉండవల్లి కరకట్ట నుంచి వైకుంఠపురం వరకు 15 కిలోమీటర్ల రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది.

రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, సమావేశాలకు వెళ్లే ముందు సీఎం ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ రోడ్డు విస్తరించడం వల్ల ఇబ్రహీంపట్నం, వెంకటపాలెం మధ్య నిర్మించే ఐకాన్ బ్రిడ్జి, కాజ టోల్ గేట్ నుంచి వెంకటపాలెం వరకు నిర్మించ తలపెట్టిన బైపాస్ రోడ్ అనుసంధానానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.
Jagan
Stone Laying Ceremony
Undavalli
Amaravati
Andhra Pradesh

More Telugu News