Allu Arjun: తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించిన అల్లు అర్జున్

Allu Arjun vaccinates his team members and their family members
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజాగా, ఆయన తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. తన టీమ్ లోని 45 ఏళ్లకు పైబడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ డోసులు వేయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అల్లు అర్జున్ స్వయంగా పర్యవేక్షించారు. టాలీవుడ్ అగ్రహీరోల్లో సొంతంగా ఓ టీమ్ ను కలిగివున్న వారిలో అల్లు అర్జున్ ఒకడు. వారి బాగోగుల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. తన టీమ్ లోని అనేకమందికి పుట్టినరోజు వేడుకలను బన్నీ స్వయంగా నిర్వహిస్తుండడం తెలిసిందే.
Go Back to Shorts
Allu Arjun
Corona Vaccination
Team Members
Family Members
Hyderabad
Tollywood

More Telugu News