Pavan kalyan: పవన్ కోసం భారీ కాలేజ్ సెట్!

Huge College set for Pavan and Harish Shankar movie
  • సెట్స్ పై పవన్ సినిమాలు రెండు
  • మూడో సినిమా హరీశ్ శంకర్ తో
  • నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్  
  • కోట్ల రూపాయల ఖర్చుతో సెట్లు
పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఇక సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ కూడా సెట్స్ పైనే ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ రెండు సినిమాలు తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆ తరువాత సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కాలేజ్ నేపథ్యంలో సన్నివేశాలు కీలకంగా ఉంటాయట. మేజర్ షెడ్యూల్ షూటింగు ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు. అందువలన కాలేజ్ సెట్ ను వేయిస్తారట. అలాగే ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన సెట్స్ కూడా వేయిస్తారట. భవిష్యత్తులో షూటింగుకి ఎలాంటి అంతరాయం రాకుండా సెట్లలోనే ఎక్కువగా కానిచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
Pavan kalyan
Harish Shankar
Mythri Movie Makers

More Telugu News