Narendra Modi: గుజరాత్ లో తుపాను సహాయచర్యలకు రూ.1000 కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ

PM Modi announced financial aid for cyclone hit Gujarat
  • గుజరాత్ వద్ద తీరం దాటిన తౌతే
  • ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని
  • అహ్మదాబాద్ లో సమీక్ష సమావేశం
  • గుజరాత్ లో నష్టం అంచనాకు కేంద్ర బృందం ఏర్పాటు
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
తౌతే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత అహ్మదాబాద్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తౌతే విధ్వంసానికి గురైన గుజరాత్ కు రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. గుజరాత్ లో తుపాను నష్టంపై అంచనాకు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా తౌతే తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను గుజరాత్ లోని పోరుబందర్, మహువా మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో ఇది పెను తుపాను స్థాయిలో ఉండడంతో విధ్వంసం కూడా అదే స్థాయిలో జరిగింది. గుజరాత్ లోని 12 జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. దీని ప్రభావంతో 45 మంది మరణించారు. ఒక్క ఆమ్రేలీ జిల్లాలోనే 15 మంది మృతి చెందారు. అపార ఆస్తినష్టం సంభవించింది.
Narendra Modi
Gujarat
Cyclone
Tauktae
Aerial Survey
Review

More Telugu News