Akash Puri: 'రొమాంటిక్' రిలీజ్ విషయంలో వచ్చేసిన క్లారిటీ!

Clarity on Romantic movie release date
  • ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక శర్మ
  • దర్శకుడిగా అనిల్ పాదూరి పరిచయం
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా తనని తాను నిరూపించుకునే పనిలో పడ్డాడు. ఆయన తాజా చిత్రంగా రొమాంటిక్ రూపొందింది. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కథ - స్క్రీన్ ప్లే పూరి అందించారు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, చిత్రీకరణను పూర్తి చేసుకుని చాలా కాలం అయింది. అయితే కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. దాంతో విడుదల ఆలస్యమవుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీకి రానుందని వార్తలు మొదలయ్యాయి.

'రొమాంటిక్' సినిమా విడుదల విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందనీ, థియేటర్లు తెరుచుకునే వరకూ ఎదురుచూడటం వలన ఇంకా ఆలస్యం జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నట్టుగా చెప్పుకున్నారు. ఇక లేట్ చేయకుండా ఈ సినిమాను ఓటీటీ ద్వారా వదలడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని అనుకున్నారు.

అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. 'రొమాంటిక్' సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నామనీ, ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అలా మొత్తానికి ఒక పుకారుకి ఫుల్ స్టాప్ పడిపోయింది.
Akash Puri
Kethika Sharma
Ramya Krishna

More Telugu News