Gadikota Srikanth Reddy: అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు బహిష్కరించడానకి కారణం ఇదే: శ్రీకాంత్ రెడ్డి

  • రఘురాజుతో కలిసి చంద్రబాబు కుట్ర పన్నారు
  • బండారం బయటపడుతుందనే అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు
  • దేశద్రోహం కేసు అనే మాటే వినలేదని అంటున్నారు
Reason why Chandrababu not coming to assembly is this says Sreekanth Reddy

దేశద్రోహం కేసు అనే మాటే వినలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై దేశద్రోహం కేసు పెట్టారని... అదే కేసుతో బెదిరించి పార్టీ మారాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు కాళ్లు చూపించడం, మీసాలు మెలేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. రఘురాజుతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు కుట్ర పన్నారని... తన పాత్ర బయటపడుతుందనే భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు రావడానికి చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని చెప్పారు.

తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు ఒక్కో సభకు రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేసి జనాలను సభకు రప్పించారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ సభల ద్వారా కరోనాను వ్యాపింపజేసి చంద్రబాబు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారని అన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ రూ. 300 కోట్ల విలాసవంతమైన ఇంట్లో కూర్చొని జూమ్ లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ఒక్క కోవిడ్ సెంటర్ కు కూడా వాళ్లు వెళ్లలేదని... ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు.

More Telugu News