Jagan: రిమ్స్ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్

  • రిమ్స్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు
  • కడప, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళంలో సీటీ స్కాన్ సేవలు
  • నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళంలో ఎంఆర్ఐ సేవలు
  • వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్
  • పేదవాడికి నాణ్యమైన వైద్యం అందిస్తామని వెల్లడి
CM Jagan launches CT Scan and MRI machines in RIMS hospitals

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన రిమ్స్ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం జగన్ వెల్లడించారు. ఆయన ఇవాళ రిమ్స్ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను ప్రారంభించారు. ఒంగోలు, శ్రీకాకుళం, నెల్లూరు పట్టణాల్లో ఉన్న రిమ్స్ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ సేవలు, కడప రిమ్స్ లో సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఈ యంత్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రులను అన్ని సౌకర్యాలతో పరిపుష్టం చేస్తామని, పేదవాడికి నాణ్యమైన చికిత్స అందించడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తాజాగా రిమ్స్ ఆసుపత్రుల్లో రూ.67 కోట్ల వ్యయంతో స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న, త్వరలో ఏర్పాటయ్యే బోధనాసుపత్రులను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నామని సీఎం వివరించారు. త్వరలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బోధనాసుపత్రితో పాటు నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

More Telugu News