హమాస్ దాడుల్లో మరణించిన సౌమ్య కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడి పరామర్శ
- ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర పోరు
- బలవుతున్న అమాయకులు
- సౌమ్య మృతి పట్ల ఇజ్రాయెల్ తీవ్ర విచారం
- సంతాపం తెలిపిన దేశాధ్యక్షుడు రెవిన్ రివ్లిన్
సౌమ్య మృతి పట్ల ఇజ్రాయెల్ విలపిస్తోందని భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు రెవెన్ రివ్లిన్ కేరళలో ఉన్న సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఫోన్ చేసిన ఆయన ఓదార్పు వచనాలు పలికారు. సౌమ్య మృతి పట్ల రివ్లిన్ సంతాపం వ్యక్తం చేశారు. అటు, ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి రోనీ యెడీడియా సోషల్ మీడియాలో స్పందించారు. సౌమ్య మరణానికి పరిహారం చెల్లిస్తామని, ఆమె కుటుంబ బాధ్యతను ఇజ్రాయెల్ అధికారులు స్వీకరిస్తారని వెల్లడించారు.