NASA: సూర్యుడి ‘కరోనా’తో ముప్పే.. ఈఎస్​ఏ హెచ్చరిక!

  • దాని నుంచి మహా వేడి పదార్థాలు విడుదల
  • కొన్ని సాంకేతికతలపై ప్రభావం
  • రక్షణ లేని వ్యోమగాములకు ప్రమాదం
  • ‘ఎజెక్షన్స్’ ఫొటోలు తీసిన సోలార్ ఆర్బిటర్
Solar Orbiter images first coronal mass ejections

సూర్యుడి ‘కరోనా’తో శాస్త్రవేత్తలు ముప్పేనంటున్నారు. ఇదెక్కడి కరోనా అంటారా? సూర్యుడి బాహ్యపొర/వలయాన్నే ‘కరోనా’ అని పిలుస్తారు. ఆ కరోనా నుంచి భారీగా మహా వేడి పదార్థాలు బయటకు చిమ్ముతున్నాయట (మాస్ ఎజెక్షన్స్). గత ఏడాది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) కలిసి ప్రయోగించిన సోలార్ ఆర్బిటర్.. ఆ ఎజెక్షన్లను తాజాగా గుర్తించిందట. ఆ వివరాలను ఈఎస్ఏ, నాసా వెల్లడించాయి.

ఆర్బిటర్ తన గమ్యాన్ని చేరేందుకు ప్రస్తుతం ప్రయాణం చేస్తున్న సోలార్ ఆర్బిటర్.. దారి మధ్యలో సూర్యుడి ఉపరితలాన్ని క్లిక్ మనిపించింది. ఆర్బిటర్ లోని ద హీలియోస్ఫెరిక్ ఇమేజర్ (సోలోహెచ్ఐ) తొలిసారి సూర్యుడి కరోనాను ఫొటో తీసింది. ఎక్స్ ట్రీమ్ అల్ట్రావయోలెట్ ఇమేజర్ (ఈయూఐ), మెటిస్ కరోనాగ్రాఫ్ లు ఇంతకుముందే కరోనా మాస్ ఎజెక్షన్లను క్లిక్ మనిపించాయి.


వాటన్నింటినీ పరిశీలించిన ఈఎస్ఏ, నాసా శాస్త్రవేత్తలు.. కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలపై సూర్యుడి కరోనా నుంచి విడుదలయ్యే ఆ వేడి పదార్థాలు తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని, నష్టం కలిగిస్తాయని చెప్పారు. సరైన రక్షణ లేని వ్యోమగాములకూ దాని వల్ల ప్రమాదమని హెచ్చరించారు. కాబట్టి సౌర వ్యవస్థలోకి అవి ప్రవేశించే తీరును పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు.


ఇక, ఈఎస్ఏ పంపించిన ప్రోబా 2, సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ (సోహో)లు సూర్యుడి ముందు భాగంలో విరజిమ్ముతున్న సౌర పదార్థాన్ని చిత్రించాయి. సూర్యుడు–భూమి మార్గంలో అత్యంత దూరంలో ఉన్న నాసా స్టీరియో ఏ కూడా సూర్యుడి కరోనా నుంచి విడుదలవుతున్న వేడి పదార్థాలను గుర్తించింది.

More Telugu News