Ali: ఆ క్షణంలో అయోమయంలో పడిపోయాను: 'కార్తీక దీపం' హీరో!

  • రైటర్ గా చెన్నైలో నాన్న బిజీ
  • నన్ను హీరోను చేద్దామనుకున్నారు
  • హైదరాబాద్ షిఫ్ట్ కావాలనుకున్నాము
  • నాన్న హఠాత్తుగా గుండెపోటుతో పోయారు  
NIrupam interview in Alitho Saradaga

బుల్లితెర ప్రేక్షకులకు నిరుపమ్ ను పరిచయం చేయవలసిన పని లేదు. ఆయన యాక్ట్ చేసిన చాలా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. పాత్ర పరిధి దాటకుండా చాలా నీట్ గా నటిస్తాడని ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన సీరియల్స్ లో 'కార్తీక దీపం' మంచి రేటింగ్ తో కొనసాగుతోంది. ఈ సీరియల్లో డాక్టర్ గా ఆయన పోషించిన పాత్రకి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఆయన తన భార్య మంజులతో కలిసి 'ఆలీతో సరదాగా' షోకి వచ్చారు. ఈ వేదిక ద్వారా ఆయన అనేక విషయాలను పంచుకున్నాడు.

"నేను పుట్టింది విజయవాడలో .. పెరిగింది చెన్నైలో .. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. మా నాన్న ఓంకార్ గారు రచయిత .. నటుడు. నేను బాగా చదువుకుని ఏదైనా మంచి ఉద్యోగం చేయాలని మా అమ్మానాన్నలకు ఉండేది. కానీ నాకేమో యాక్టింగ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అదే విషయాన్ని ఓ రోజున మా నాన్నగారితో చెప్పాను. ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదు. మా అమ్మగారు కూడా ఏడ్చి గోలచేసింది. అయినా మా నాన్నగారు నా ఇష్ట ప్రకారమే చేయాలనుకున్నారు. ఇండస్ట్రీ అప్పటికే హైదరాబాద్ వచ్చేసింది .. అందువలన మా నాన్నగారు మా ఫ్యామిలీని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయాలనుకున్నారు.

సీరియల్స్ కి రైటర్ గా .. నటుడిగా చెన్నైలో నాన్నగారు చాలా బిజీ. అయినా ఆ అవకాశాలను వదులుకుని నా కోసం హైదరాబాద్ రావడానికి ఆయన సిద్ధపడ్డారు. హైదరాబాద్ వచ్చి ఇల్లు చూసుకోవడం కూడా జరిగిపోయింది. ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలనే విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాము. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే ఆయన గుండెపోటుతో చనిపోయారు. హఠాత్తుగా ఆయన దూరమైపోవడంతో నా భవిష్యత్తు అంధకారమైపోయింది .. అయోమయంలో పడిపోయాను. నన్ను నటుడిగా చూడాలనే కోరిక నెరవేరకుండానే ఆయన వెళ్లిపోవడం దురదృష్టకరం" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News