Nidhi Aggarwal: తమిళనాడు ముఖ్యమంత్రికి విరాళం అందించిన నిధి అగర్వాల్

Nidhi Aggarwal donates to CM relief fund
  • కరోనా బాధితుల సహాయార్థం నిధి విరాళం
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు ఇచ్చిన వైనం
  • ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన నటిస్తున్న నిధి
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది దీని బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. ప్రతి రోజు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తన వంతు సాయం అందించింది. తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయల విరాళాన్ని అందజేసింది. అంతే కాదు 'ఫైండ్ ఏ బెడ్'కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీని ద్వారా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్ల సమాచారాన్ని తెలియజేస్తోంది.

ఇటీవల నిధి తమిళ సినీపరిశ్రమకు దగ్గరైంది. ఆమె నటించిన రెండు చిత్రాలు ఈమధ్యనే విడుదలయ్యాయి. ఇక తెలుగులో తాజాగా పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది.  
Nidhi Aggarwal
Donation
Tollywood

More Telugu News