Raghu Rama Krishna Raju: రఘురాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాం: ఆర్మీ ఆసుపత్రి వైద్యులు

Army hospital doctors conducted medical tests for Raghu Rama Krishna Raju
  • జ్యుడీషియల్ అధికారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశాం
  • మొత్తం ప్రక్రియను వీడియో తీశాం
  • ప్రస్తుతం రఘురాజు మెడికల్ కేర్ లో ఉన్నారు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యుల బృందం పరీక్షలను నిర్వహించిందని చెప్పారు.

ఈ పరీక్షల ప్రక్రియను వీడియో తీశామని తెలిపారు. ప్రస్తుతం రఘురాజు ఆసుపత్రిలో మెడికల్ కేర్ లో ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉంటారని వెల్లడించారు. కరోనా ప్రొటోకాల్ ను కూడా పాటిస్తున్నామని చెప్పారు.

మరోవైపు డాక్టర్లు ఇచ్చే రిపోర్టును సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్ లో సమర్పించనుంది. రఘురాజు ఆసుపత్రిలో ఉన్న సమయాన్ని కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టుగానే పరిగణించనున్నారు. ఇదిలావుంచితే, ఆయనను కలిసేందుకు ఆర్మీ అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు.
Raghu Rama Krishna Raju
Army Hospital
YSRCP

More Telugu News