Manohar: కరోనా సమయంలో మత రాజకీయాలు మానుకోవాలి: కన్నాకు గుంటూరు మేయర్ హితవు

Guntur mayor Manohar questions Kanna Lakshminarayana comments
  • ఆలయాల్లో కొవిడ్ సెంటర్లు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నా
  • కన్నాను తప్పుబట్టిన గుంటూరు మేయర్ మనోహర్
  • సిబ్బంది కోసమే కొవిడ్ కేంద్రాల ఏర్పాటు అని వివరణ
ఏపీలో పలు దేవాలయాలను కొవిడ్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. దీనిపై గుంటూరు మేయర్ మనోహర్ స్పందించారు. కన్నా అవాస్తవాలు ప్రచారం చేయకూడదని అన్నారు. కన్నా అసత్యాలతో కూడిన ట్వీట్లు చేశారని ఆరోపించారు.

ఉద్యోగులు, సిబ్బంది కోసమే ఆలయాల కాటేజీలు, సత్రాల్లో కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని మనోహర్ వెల్లడించారు. కన్నా లక్ష్మీనారాయణ మత విద్వేషాలు రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కరోనా సమయంలో కన్నా మత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
Manohar
Guntur Mayor
Kanna Lakshminarayana
Covid Centres
Temples
Andhra Pradesh

More Telugu News