అందరం దేశానికి సేవ చేసే టైమొచ్చింది: సినీ హీరో వెంకటేశ్

18-05-2021 Tue 19:16
  • పెరగాల్సింది భయం కాదన్న వెంకటేశ్
  • బాధ్యత పెరగాలని సూచన
  • ఒకరికొకరం దూరంగా ఉంటూ సురక్షితంగా ఉందామని వ్యాఖ్యలు
  • మన దేశాన్ని మనమే రక్షించుకుందామని పిలుపు
Venkatesh calls for self care from covid

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సందేశం అందించారు. మనం అందరం దేశానికి సేవ చేసే టైమొచ్చిందని అన్నారు. మనం ఏమీ చేయలేం అనుకోవద్దని, రోజురోజుకు పెరగాల్సింది భయం కాదని, బాధ్యత అని పిలుపునిచ్చారు. అందరం ఒకరికి ఒకరం దూరంగా ఉంటూ, బయటికి వెళ్లకుండా, ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుందామని అన్నారు.

కరోనా బారి నుంచి మనదేశాన్ని మనమే రక్షించుకుందాం అని దృఢసంకల్పం వెలిబుచ్చారు. ఈ మేరకు వెంకటేశ్ సందేశంతో కూడిన వీడియోను ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్యాంధ్ర విభాగం సోషల్ మీడియాలో పంచుకుంది.