'పుష్ప' రెండు భాగాల మొత్తం ఖర్చు 250 కోట్లు?

18-05-2021 Tue 18:00
  • లుక్ తో మార్కులు కొట్టేసిన బన్నీ
  • గిరిజన యువతిగా రష్మిక
  • బన్నీ కెరియర్లోనే భారీ బడ్జెట్  
Huge budjet for Pushpa movie

అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ వారు 'పుష్ప' సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. కథా పరిధి ఎక్కువగా ఉండటంతో, రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. మొదటి భాగం 'పుష్ప' టైటిల్ తో విడుదలవుతుందట. ఇక రెండవ భాగం 'పుష్ప 2' అని కాకుండా వేరే టైటిల్ ను సెట్ చేస్తారట. ఆ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఈ రెండు భాగాలకు కలుపుకుని అవుతున్న ఖర్చు 250 కోట్లు అని అంటున్నారు. అంటే అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుందన్న మాట. ఇప్పటికే అల్లు అర్జున్ లుక్ కీ .. 'తగ్గేదే లే' అనే ఆయన మేనరిజానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గిరిజన యువతిగా రష్మిక నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఈ సినిమా సెకండాఫ్ లోనే ఐటమ్ సాంగ్ ఉంటుందనీ, అందుకోసం దిశా పటాని పేరును పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.