'ఖిలాడి' షూటింగు అప్ డేట్!

18-05-2021 Tue 17:04
  • రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి'
  • కొంత చిత్రీకరణ మాత్రమే పెండింగ్
  • థియేటర్లలోనే రిలీజ్
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
Update on Raviteja Khiladi

రవితేజ కథానాయకుడిగా 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. దీనికి కారణం, ఇంకా రెండు పాటలు.. కొంత టాకీపార్ట్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ఆ కాస్త చిత్రీకరణ జరిపితే, షూటింగు పార్టు పూర్తయినట్టేనని చెబుతున్నారు.

రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథాకథనాలతో రమేశ్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అలరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను దసరాకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచనేం చేయలేదనీ, ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.