తిరుపతి రుయా ఘటనపై స్పందించిన ఎన్ హెచ్ఆర్ సీ

18-05-2021 Tue 16:45
  • తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇటీవల 11 మంది మృతి
  • ఆక్సిజన్ అందక చనిపోయిన కరోనా రోగులు
  • ఎన్ హెచ్ఆర్ సీకి ఫిర్యాదు చేసిన చింతా మోహన్, సుధాకర్
  • నివేదిక అందించాలని ఆరోగ్యశాఖను ఆదేశించిన కమిషన్
NHRC responds to Tirupati RUIA hospital incident

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇటీవల ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) స్పందించింది. రుయా ఘటనపై చింతా మోహన్, సుధాకర్ ఎన్ హెచ్ఆర్ సీకి ఫిర్యాదు చేశారు. ఆక్సిజన్ కొరతతో 11 మంది చనిపోయారని సుధాకర్ ఫిర్యాదు చేయగా, రుయాలో 30 మంది చనిపోయారని చింతా మోహన్ ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్... ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది. రుయా ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్యశాఖను ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక అందించాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి స్పష్టం చేసింది.