నాన్నను ఆర్మీ అధికారులు కలవనీయలేదు: రఘురాజు కుమారుడు

18-05-2021 Tue 16:17
  • సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురాజు
  • కలిసేందుకు వెళ్లిన కుటుంబసభ్యులు
  • ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసిన అధికారులు
Army offices not allowed Raghu Rajus family to see him

ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈరోజు సికింద్రాబాదులోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయనను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు యత్నించారు. కానీ రఘురాజును కలిసేందుకు ఆర్మీ అధికారులు అనుమతించలేదు. ఆసుపత్రి వద్ద రఘురాజు కుమారుడు భరత్ ను ఆర్మీ సిబ్బంది అడ్డుకున్నారు.

రఘురాజును కలిసేందుకు ఏ ఒక్కరికీ అనుమతి లేదని ఆర్మీ అధికారులు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రఘురాజు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని... ఈ నేపథ్యంలో ఏ ఒక్కరినీ తాము అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో, ఆయన కుటుంబసభ్యులు అక్కడి నుంచి వెనుదిరిగారు.