వరుసగా రెండో రోజు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

18-05-2021 Tue 16:02
  • 613 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 185 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6 శాతం వరకు పెరిగిన ఎం అండ్ ఎం షేర్
Sensex gains 613 points

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. మన దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో పాటు ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో కొనసాగడం కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపింది.

ఈరోజు మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి లాభాల్లోనే పయనించాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 613 పాయింట్లు ఎగబాకి 50,193కి చేరుకుంది. నిఫ్టీ 185 పాయింట్లు లాభపడి 15,108 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.91%), బజాజ్ ఆటో (5.17%), టైటాన్ కంపెనీ (4.89%), బజాజ్ ఫైనాన్స్ (4.84%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.75%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.41%), ఐటీసీ (-1.18%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.68%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.27%).