Dr Reddys Laboratories: స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ నుంచి మినహాయింపు కోరాలని భావిస్తున్న డాక్టర్ రెడ్డీస్!

Dr Reddys wants waiver for Sputnik Light corona vaccine from trials
  • త్వరలో భారత్ లోనూ స్పుత్నిక్ లైట్
  • స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్
  • రష్యా వర్గాలతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
  • త్వరలో డీసీజీఐకి డేటా సమర్పణ
  • పూర్తి సమాచారం సేకరిస్తున్నామన్న డాక్టర్ రెడ్డీస్
రష్యా తయారీ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ ను భారత్ లో డాక్టర్ రెడ్డీస్ ఫార్మా సంస్థ పంపిణీ చేయనుంది. స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ కు ఇటీవలే రష్యాలో వినియోగానికి ఆమోదం లభించింది. ఇప్పటికే భారత్ లో స్పుతిక్ వి (రెండు డోసుల వ్యాక్సిన్) పంపిణీ, తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్.... ఈ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ను కూడా అందించేందుకు సిద్ధమైంది. అయితే, భారత్ లో మళ్లీ ప్రత్యేకంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఎందుకని భావిస్తోంది.

ఈ క్రమంలో, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నుంచి మినహాయింపు కోరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మాత్రమేనని, ఇక్కడ వ్యాక్సిన్ ను మళ్లీ అభివృద్ధి చేయడం ఏమీ ఉండదని ఫార్మా కంపెనీ వర్గాలు తెలిపాయి.

అందువల్ల ప్రత్యేకంగా ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని, ఈ విషయాన్ని భారత ఔషధ నియంత్రణ రెగ్యులేటరీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం అధిపతి డాక్టర్ శౌరి గుడ్లవల్లేటి తెలిపారు. రష్యాలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు చెందిన పూర్తి సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని, ప్రయోగ ఫలితాల డేటా కూడా వచ్చిన తర్వాత కేంద్రానికి సమర్పిస్తామని, అందుకే మరికొన్ని వారాల సమయం పట్టనుందని డాక్టర్ శౌరి వివరించారు.
Dr Reddys Laboratories
Sputnik Light
Clinical Trials
India
Russia

More Telugu News