Andhra Pradesh: 'మత్స్యకార భరోసా' పథకం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేసిన జగన్ సర్కారు

  • పేద ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డకుండా ప‌థ‌కాలు
  • 1,19,875 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు దాదాపు రూ.120 కోట్లు
  • మ‌త్య్స‌కారుల‌కు అండ‌గా ఉంటామ‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నాం
financial problems in ap say jagan

వైఎస్సార్ మ‌త్స్య‌కార భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు. బటన్ నొక్కి ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి న‌గ‌దు జ‌మ‌చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన మ‌త్స్య‌కారుల‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌నుంది. చేప‌ల వేట నిషేధ స‌మ‌యంలో కుటుంబ పోష‌ణ నిమిత్తం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. క‌రోనా వేళ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్థికంగా క‌ష్టాలు ఉన్నాయ‌ని, అయిన‌ప్ప‌టికీ పేద ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కూద‌న్న ఉద్దేశంతో తాము వారి సంక్షేమం కోసం అన్ని కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో 1,19,875 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు దాదాపు రూ.120 కోట్లు జ‌మ చేశామ‌ని తెలిపారు.

మ‌త్య్స‌కారుల‌కు అండ‌గా ఉంటామ‌ని ఇచ్చిన హామీని తాము నిల‌బెట్టుకుంటున్నామ‌ని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. క‌రోనా ప‌రిస్థితుల్లోనూ తాము ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా మ‌త్స్య‌కార భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. తాము అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప్రారంభించినట్లు చెప్పారు.

More Telugu News