క‌రోనాతో గున్నం నాగిరెడ్డి మృతి.. త‌మ‌ కుటుంబం మ‌రో ఆప్తుడిని కోల్పోయిందన్న‌ వైఎస్ ష‌ర్మిల

18-05-2021 Tue 11:54
  • మా కుటుంబం మ‌రో ఆప్తుడిని కోల్పోయింది
  • నాగిరెడ్డి అన్న‌ ప‌విత్రఆత్మ‌కు శాంతి చేకూరాలి
  • వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి
sharmila mourns demise of nagi reddy

వైసీపీ సీనియ‌ర్ నేత గున్నం నాగిరెడ్డి ఈ రోజు ఉద‌యం మృతి చెందారు. ఆయ‌న‌కు ఇటీవ‌ల‌ క‌రోనా సోక‌డంతో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న మృతి ప‌ట్ల వైఎస్ ష‌ర్మిల సంతాపం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. త‌మ‌ కుటుంబం మ‌రో ఆప్తుడిని కోల్పోయిందని అన్నారు.

'క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ మా కుటుంబం మ‌రో ఆప్తుడిని కోల్పోయింది. నాన్న‌కు అత్యంత స‌న్నిహితులు గున్నం నాగిరెడ్డి అన్న మ‌ర‌ణం న‌న్ను తీవ్రంగా క‌ల‌చివేసింది. నాగిరెడ్డి అన్న‌ ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను' అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.