కొత్త కథపై మారుతి కసరత్తు!
- వినోదమే ప్రధానంగా మారుతి సినిమాలు
- 'మహానుభావుడు' తరువాత దక్కని హిట్
- కొత్తదనమే ప్రధానమంటున్న మారుతి
ప్రస్తుతం ఆయన 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. కరోనా కారణంగా షూటింగు ఆగిపోయింది. ప్రస్తుతం మారుతి ఒక కొత్త కథపై కసరత్తు చేస్తున్నాడట. ఈ మాటను ఆయనే స్వయంగా చెప్పాడు. వైవిధ్యభరితమైన ఒక కథను తయారు చేస్తున్నట్టుగా ఆయన చెప్పాడు. తదుపరి ప్రాజెక్టు ఈ కథతోనే సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. ప్రేక్షకులు ఆశిస్తున్న కొత్తదనాన్ని అందించకపోతే ఇక్కడ మనుగడ కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.