CPI Narayana: ఎంపీ రఘురామ అరెస్ట్ వెనక అమిత్ షా, కేసీఆర్: సీపీఐ నారాయణ ఆరోపణలు

Amit Shah and KCR behind the arrest of Raghurama Krishna Raju
  • వారి సహకారం లేకుండా రఘురామను అరెస్ట్ చేయలేరు
  • వ్యాక్సిన్ కంపెనీ అధినేత కులాన్ని జగన్ ప్రస్తావించారు
  • పై స్థాయి బీజేపీ నాయకుల నుంచి అరెస్టులకు అనుమతి
  • రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం ఖండిస్తారు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వారిద్దరి సహకారం లేకుండా రఘురామను అరెస్ట్ చేసే అవకాశమే లేదన్నారు. రఘురామ వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదన్న నారాయణ..కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఓ వ్యాక్సిన్ కంపెనీ అధినేత కులం గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారన్న విషయాన్ని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు.

అరెస్టులకు పై స్థాయిలోని బీజేపీ నేతలు అనుమతి ఇస్తున్నారని, రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం అరెస్టులను ఖండిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల తీరు వింతగా ఉందన్నారు. ఈటల రాజేందర్ పైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమని, అలాంటి పరిస్థితే వస్తే కనుక ప్రజలే బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు.
CPI Narayana
Raghu Rama Krishna Raju
Arrest
Amit Shah
KCR

More Telugu News