సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

18-05-2021 Tue 07:28
  • హిందీ ట్యూటర్ ని పెట్టుకున్న రష్మిక 
  • మహేశ్ సరసన ఇద్దరు హీరోయిన్లు
  • తెలుగులోకి మరో బాలీవుడ్ సినిమా
Rashmikas hired a Hindi tutor

*  ప్రస్తుతం రెండు హిందీ సినిమాలలో నటిస్తున్న కథానాయిక రష్మిక బాలీవుడ్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. దీంతో తన హిందీ భాషా పరిజ్ఞానాన్ని పెంచుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ట్యూటర్ ని పెట్టుకుని హిందీ భాష నేర్చుకుంటోంది. తద్వారా భాషపై పట్టు సాధించాలని ఈ చిన్నది కోరుకుంటోంది.
*  మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇద్దరి పాత్రలూ పూర్తి నిడివితో సాగుతాయట. వీరిలో ఒకరిగా పూజ హెగ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరొక నటిని బాలీవుడ్ నుంచి తీసుకుంటారని అంటున్నారు.
*  పదిహేనేళ్ల క్రితం వచ్చిన హిందీ సినిమా 'వివాహ్' తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తీసుకున్నట్టు తాజా సమాచారం. తన చిన్న కొడుకు సాయి గణేశ్ హీరోగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారట.