గ్రీన్ కో చర్యలు అభినందనీయం: రామ్ చరణ్

17-05-2021 Mon 21:06
  • చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తెప్పించిన గ్రీన్ కో
  • తెలంగాణ సర్కారుకు అందజేత
  • గ్రీన్ కో తన సన్నిహితుడికి చెందిన సంస్థ అని రామ్ చరణ్ వెల్లడి
  • దేశవ్యాప్తంగా సాయం చేస్తోందని వివరణ
Ram Charan appreciates Greenko

కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్న వ్యక్తుల్లో అత్యధికులకు ఆక్సిజన్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడగా, గ్రీన్ కో సంస్థ చైనా నుంచి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, పెద్ద సంఖ్యలో సిలిండర్లను తెప్పించి తెలంగాణ ప్రభుత్వానికి అందించింది.

దీనిపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్పందిస్తూ, గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. గ్రీన్ కో తన స్నేహితుడికి చెందిన సంస్థ అని రామ్ చరణ్ వెల్లడించారు. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లను అందిస్తోందని కొనియాడారు.