Jagan: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు... సీఎం జగన్ నిర్ణయం

  • ఏపీలో కరోనా మృత్యుఘంటికలు
  • అనేక కుటుంబాల్లో విషాదం నింపుతున్న కరోనా
  • తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా చిన్నారులు
  • పిల్లల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్
  • వడ్డీతో పిల్లల అవసరాలు తీరేలా కార్యాచరణ
CM Jagan decides to fixed deposit for children who lost parents due to corona

కరోనా మహమ్మారి అనేక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా బారినపడిన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతుంటే, వారి పిల్లలు అనాథల్లా మారుతున్నారు. ఒకే ఇంట్లో అత్యధిక సంఖ్యలో మరణాలు కరోనా కారణంగా సంభవిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు. ఆ మొత్తాన్ని పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నారు. ఆ ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీతో పిల్లల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను నిర్దేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ఏపీలో ఇప్పటివరకు 9 వేలకు పైగా కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. మహమ్మారి వైరస్ కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

More Telugu News