జీహెచ్ఎంసీ పరిధిలో మరో 631 మందికి కరోనా పాజిటివ్

17-05-2021 Mon 19:44
  • గత 24 గంటల్లో 62,591 కరోనా పరీక్షలు
  • రాష్ట్రంలో మరో 3,961 మందికి పాజిటివ్
  • 30 మంది మృతి.. కోలుకున్నవారు 5,559 మంది 
  • ఇంకా 49,341 మందికి చికిత్స
Corona positive cases declines in GHMC area

తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోనూ కొత్త కేసుల సంఖ్య దిగివస్తోంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 62,591 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 631 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. ఇతర జిల్లాలు క్రమంగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 30 మంది మరణించారు. అదే సమయంలో 5,559 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

రాష్ట్రంలో ఇంకా 49,341 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 5,32,784 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,80,458 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. అటు, తెలంగాణలో రికవరీ రేటు 90.17 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయి రికవరీ రేటు 84.8 శాతంగా ఉంది.