ఈ సారి కూడా స్టార్ హీరోతోనే 'వకీల్ సాబ్' డైరెక్టర్!

17-05-2021 Mon 18:31
  • 'వకీల్ సాబ్'తో హిట్
  • వేణు శ్రీరామ్ పై ఊహాగానాలు
  • క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
  • పెద్ద బ్యానర్లతో చర్చలు  
Venu Sri Ram another will be with star hero

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ 'వకీల్ సాబ్' సినిమా చేశాడు. కొంత గ్యాప్ తరువాత పవన్ చేసిన సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో వేణు సక్సెస్ అయ్యాడు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది. ఆ తరువాత కూడా దిల్ రాజు - వేణు శ్రీరామ్ కాంబినేషన్ లోనే ఒక సినిమా రానున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో దిల్ రాజ్ క్యాంపస్ లోనే వేణు ఉండిపోతాడనే వార్తలు వచ్చాయి.

అయితే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు .. ఇలాంటి ఊహాగానాలకు తెరదించేశాడు. తన తదుపరి సినిమాకి సంబంధించి తాను ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదని ఆయన చెప్పాడు. దిల్ రాజు బ్యానర్లో మాత్రమే కాకుండా ఇతర బ్యానర్లలో సినిమాలు చేయాడానికి తాను సిద్ధంగానే ఉన్నానని అన్నాడు. అలా వేణు తనతో సినిమాలు చేయాలనుకుంటున్న నిర్మాతలకు ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆయన రెండు పెద్ద బ్యానర్లతో చర్చలు జరుపుతున్నాడట. ఏ బ్యానర్ వారు ఓకే చెప్పినా, సెట్స్ పైకి వెళ్లేది స్టార్ హీరోతోనేనని తెలుస్తోంది.