హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్!

17-05-2021 Mon 17:33
  • వైష్ణవ్ తేజ్ తాజా చిత్రంగా 'కొండ పొలం'
  • 'ఆదిత్యవర్మ' దర్శకుడితో మరో సినిమా
  • నాలుగో సినిమా అన్నపూర్ణ బ్యానర్లో
  • దర్శకుడిగా పృథ్వీ పరిచయం  
Vaishnav Tej upcoming movie update

హీరోగా తొలి సినిమాతో హిట్ కొట్టడం చాలా తక్కువమంది విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సంఘటన వైష్ణవ్ తేజ్ కెరియర్లోను జరిగింది. ఆయన హీరోగా రూపొందిన 'ఉప్పెన' భారీ విజయాన్ని అందుకుంది. రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. దాంతో వైష్ణవ్ తేజ్ ను అవకాశాలు చుట్టుముడుతున్నాయి. అయితే కథలో కొత్తదనం ఉండి, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఆయన అంగీకరిస్తూ వెళుతున్నాడు. అలా ఆయన క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' చేశాడు.

ఇక మూడో సినిమాను తమిళంలో 'ఆదిత్య వర్మ'ను తెరకెక్కించిన దర్శకుడితో చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన అన్నపూర్ణ  బ్యానర్లో చేయనున్నాడు. ఈ సినిమా ద్వారా పృథ్వీ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడట. ఆ పాత్రకి తగిన విధంగా కొంత శిక్షణ పొందిన తరువాతనే వైష్ణవ్ తేజ్ రంగంలోకి దిగానున్నాడని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేేసిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లొచ్చని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.