KCR: కరోనా, బ్లాక్ ఫంగస్ పై సమీక్ష నిర్వహించిన కేసీఆర్

KCR holds review meeting on Coroan and Black Fungus
  • ప్రగతి భవన్ లో కొనసాగిన సమీక్షా సమావేశం
  • హాజరైన సీఎస్, ఇతర ఉన్నతాధికారులు
  • ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న సీఎం
తెలంగాణలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. కోవిడ్ బాధితులకు చికిత్స, ఔషధాలు, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేసీఆర్ చర్చించారు. ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల లభ్యతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.
KCR
TRS
Corona Virus

More Telugu News