బ్యాంకింగ్ స్టాకుల అండతో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

17-05-2021 Mon 16:18
  • 848 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 245 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7.27 శాతం లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో.. అక్కడి సంకేతాలతో ఆసియా మార్కెట్లన్నీ ఈరోజు పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి.

ఇదే సమయంలో మన దేశంలో కరోనా కేసులు తగ్గడం కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 49,581కి చేరుకుంది. నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 14,923 కి ఎగబాకింది. ఈ నాటి మార్కెట్లను బ్యాంకింగ్ స్టాకులు ముందుండి నడిపించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.41%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.81%), యాక్సిస్ బ్యాంక్ (3.53%).

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-2.02%), భారతి ఎయిర్ టెల్ (-1.96%), నెస్లే ఇండియా (-0.97%), సన్ ఫార్మా (-0.60%%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.26%).