క‌రోనా సాయంగా స్టాలిన్‌కు రూ.50 ల‌క్ష‌లు అందించిన ర‌జ‌నీకాంత్‌

17-05-2021 Mon 13:38
  • స్టాలిన్ వ‌ద్ద‌కు వెళ్లి చెక్ ఇచ్చిన ర‌జ‌నీ
  • త‌మిళ‌నాడులో భారీగా న‌మోదవుతోన్న కేసులు
  • పెద్ద ఎత్తున సాయం అందిస్తోన్న‌ త‌మిళ హీరోలు
Rajinikanth met Tamil Nadu Chief Minister

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ను ఈ రోజు సౌతిండియా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌లిశారు. త‌మిళ‌నాడులో కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో సీఎం స‌హాయ నిధికి ర‌జ‌నీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును స్టాలిన్‌కు ఆయన అందజేశారు.

త‌మిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వ‌చ్చి క‌రోనా సాయం అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే సూర్య‌-కార్తి రూ.కోటి అందించారు. అలాగే, అజిత్‌, శివ‌కార్తికేయ‌న్ రూ.25 ల‌క్ష‌ల చొప్పున విరాళాలు అందించారు.