జగన్, సీబీఐలకు కౌంటరు దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు

17-05-2021 Mon 12:01
  • బెయిల్ రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్
  • కౌంటరు దాఖలు చేసేందుకు మరింత గడువు కోరిన జగన్
  • విచారణను 26కి వాయిదా వేసిన కోర్టు
CBI Court gives time to Jagan to file counter

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను, సీబీఐను గతంలో ఆదేశించింది.

అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరగా కోర్టు తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. అయితే కౌంటరు దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. వారి విన్నపాన్ని కోర్టు అంగీకరించింది. అయితే కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.